- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల విధుల నిర్లక్ష్యం పై 10 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ
దిశ, సూర్యాపేట : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల విధుల్లో ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావు శుక్రవారం స్థానికంగా తెలిపారు. తుంగతుర్తి , కోదాడ నియోజకవర్గంలోని ఎస్ఎస్టీ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను 10 మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు జిల్లా అధికారుల 13 మంది పాల్గొనక పోవడం పట్ల హెచ్చరికలు, మెమోలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో నలుగురు, తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరుగురు ఎస్ ఎస్‌టీ టీం అధికారులు సరైన రీతిలో విధులు నిర్వహించక పోవడంపై, విధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ మెమోలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.