'అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం'

by Sumithra |
అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం
X

దిశ, భూదాన్ పోచంపల్లి : నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో కళ్ళల్లో చీకట్లను నింపి మూతపడ్డదని ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. మూడు రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎమ్మేల్యేగా గెలుపొంది పాగవేసి చరిత్ర తిరగరాయాలని కసితో ఆదివారం విస్తృత ప్రచారంలో జోరుగా ఆయన అశేష జనాల మధ్య రోడ్ షో నిర్వహించారు. పోచంపల్లి మండలంలోని భీమనపల్లి, హైదర్ పూర్ గ్రామాల్లో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు బోనాలతో, డప్పుచప్పులతో, భారీ గజమాలతో సత్కరించి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా పోచంపల్లి పట్టణంలో గాంధీనగర్ తో పాటు వివిధ వార్డుల్లో ప్రధాన రోడ్డు వెంట జనంతో భారీ ర్యాలీగా పర్యటించి నేతాజీ కూడలి వద్ద ఆయన మాట్లాడుతూ మండలంలోని రసాయన కంపెనీలను ముచ్చర్ల ఫార్మసిటీకి తరలిస్తామని, రైతులకు వరికి గిట్టు బాటు ధర చేనేత ఋణ మాఫీ చేస్తామని, నిత్యం ప్రజాసమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇస్తూ ప్రజా ఆశీర్వాదంతో ఎమ్మేల్యేగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రైతన్నలకు, నేతన్నలకు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ప్రణాళిక చేస్తామని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

పోచంపల్లి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ దే : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కడప వెంకటేశం

పోచంపల్లిలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన ఘనత, జూనియర్ కాలేజ్, వినోబా మందిరం, టూరిజం సెంటర్ వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ దేనని భవిష్యత్తు మారాలన్న, ఉద్యోగాలు రావాలన్న, ఆత్మహత్యలు ఆగాలన్న కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి అనిల్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భువనగిరి జిల్లా పై జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కళ్లెం రఘువరెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్స్ మోటే రజిత రాజు, భోగ భానుమతి విష్ణు, టౌన్ అధ్యక్షులు భారత లవ కుమార్, ఆర్ జీపీఆర్ జిల్లా కోఆర్డినేటర్ గునిగంటి రమేష్ గౌడ్, పోచంపల్లి మాజీ ఇంచార్జ్ సర్పంచ్ గడ్డం వెంకటేశం, వలిగొండ సీపీఐ సెక్రటరీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కుడికాల సృజన, మాజి టై అండ్ డై అధ్యక్షుడు భారత వాసుదేవ్, జిల్లా నాయకులు కుమార్, వంగూరి పాండు, రుద్ర చంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed