- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర 2వ మహా సభలను విజయవంతం చేయండి.. జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుల్లయ్య
దిశ, పెన్ పహాడ్: హైద్రాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ వేదికలో ఈ నెల 27న జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ ) 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలిగంటి పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విలేఖరికి అక్రిడియేషన్ కార్డు, ఆరోగ్య బీమా, సొంత ఇల్లు కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాటు పడుతోందని గుర్తుచేశారు. కార్పొరేట్ల గుప్పిట్లో మీడియా చిక్కుకున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఉద్యోగాలకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నందుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. పెరుగుతోన్న ప్రభుత్వాల ఆంక్షల మధ్య తమ వృత్తిని నిర్వహించడం కష్టంగా మారిందని వాపోయారు.
ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు తలెత్తినా జర్నలిస్టలు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీడబ్ల్యూజేఎఫ్ పని చేస్తోందని చెప్పారు. ఇండ్ల స్థలాలు, అక్రిడియేషన్లు, హెల్త్ కార్డులు, బస్సు, రైల్వే పాసులు తదితర సమస్యలపై హైదరాబాద్ లో నిర్వహించే సభలో చర్చించనున్నామని, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరావాలని పుల్లయ్య కోరారు.
- Tags
- nalgonda