- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాలకు తాళం
దిశ,కోదాడ : కోదాడ పట్టణం పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి భవన యజమాని తాళం వేయడంతో.. మంగళవారం ఆరు బయటనే అధ్యాపక బృందం విధులు నిర్వహించారు. దసరా సెలవులు ముగియడంతో.. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు బయట పడిగాపులు కాశారు. కొంతమంది విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లడానికి వచ్చారు. ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న గురుకుల పాఠాశాలలకు పెండింగ్ లో ఉన్న అద్దె బకాయలు చెల్లించనందున మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవనానికి భవన యాజమాన్యం తాళం వేశారు.సంవత్సర కాలం నుంచి అద్దె చెల్లించనందున పలుమార్లు కమీషనర్,రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఏలాంటి స్పందన లేకపోవడంతో..తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ గురుకుల పాఠశాల భవనాల యాజమాన్యం పిలుపుమేరకు గేటుకు తాళం వేసినట్టు తెలిపారు. ఈ పాఠశాలలో 30 మంది టీచర్లు, 600 మంది విద్యార్థినిలు ఉన్నారని అధ్యాపకులు తెలిపారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపిస్తున్నట్లు యాజమాన్యం తెలిపారు.