- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Govt.: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా (Vikarabad District) దుద్యాల మండల (Dudyala Mandal) పరిధిలోని లగచర్ల (Lagacharla)లో ఫార్మాసిటీ (Pharma City) కోసం సర్కార్ విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసింది. అయితే, తాజాగా దుద్యాల్ మండల పరిధిలోని లగచర్ల, పోలేపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) కోసం భూసేకరణకు ఇవాళ ఉదయం ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీ (Pharma Compnies)ల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యానికి నెలవుగా మారుతాయని అక్కడి ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు దుద్యాల మండల పరిధిలోని లగచర్లలో 110.2 ఎకరాలు, పోలేపల్లిలో 71.9 ఎకరాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor)లో భాగంగా ముఖ్యంగా టెక్స్‌టైల్ కంపెనీ (Textile Company)లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. కాలుష్య రహిత కంపెనీల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించిన లగచర్ల (Lagacharla), హకీంపేట్ (Hakimpet), పోలేపల్లి (Polepally) గ్రామస్థులు ఇండస్ట్రియల్ కారిడార్‌కు అయినా.. ఓకే చెబుతారా లేక మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతారా అనే విషయం తెలాల్సి ఉంది.