- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 9 లోగా రుణమాఫీ పూర్తి చేస్తాం-మంత్రి తుమ్మల
దిశ ,హాలియా : కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ వర్తింప చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. డిసెంబర్ 9 లోగా ప్రతి రైతుకు రుణమాఫీ పూర్తి చేసి.. ఆ తర్వాత రైతు భరోసా రూ.7500 రైతుల అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. హాలియా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో రైతులు పామాయిల్ సాగు గణనీయంగా పెంచాలని, రైతుల సౌకర్యార్థం పామాయిల్ ఉత్పత్తి కేంద్రాన్ని నల్లగొండ జిల్లాలో సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కనీస సౌకర్యాలు అందించేందుకు మార్కెట్ యార్డులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ,ఇప్పటికే పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించామని తెలిపారు. నల్లగొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాలు తమకు రెండు కళ్ళులాంటివని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లు ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పదవులు వస్తాయని ఎటువంటి అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. నిజమైన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై వివరించారు. అనంతరం హాలియా మార్కెట్ చైర్మన్ గా తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కాల్ సాని చంద్రశేఖర్ యాదవ్, పలువురు డైరెక్టర్లను, మార్కెట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కర్నాటి లింగారెడ్డి, కొండేటి మల్లయ్య అబ్బిడి కృష్ణారెడ్డి కుందూరు వెంకట్ రెడ్డి కాకునూరు నారాయణ గౌడ్ చింతల చంద్రారెడ్డి భాస్కర్ నాయక్ కృష్ణా నాయక్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.