- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయాలి : డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
దిశ, బీబీనగర్ : రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రైతుకు హామీ ఇచ్చిన విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. వ్యవసాయదారులకు ఎలాంటి సబ్సిడీ, పంటల బీమా లేకుండా చేసి రైతుబంధు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ఉన్న అనేక భూములను కేసీఆర్ ప్రభుత్వం లోని పెద్దలు కాజేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గతంలో పేదలకు భూములు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని పరిశ్రమలు అభివృద్ధి పేరిట లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అశోక్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, రజిత అమరేందర్ రెడ్డి, వసంత బసవయ్య గౌడ్, నాయకులు వేణు గౌడ్, బసవయ్య, ఆగమయ్య గౌడ్, పెంటయ్య గౌడ్, చందు నాయక్, గోపినాయక్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ ,వేణు, వాసుదేవ రెడ్డి, రాజేందర్ ,నిఖిల్ రెడ్డి, శరత్, శివ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- nalgonda