అయ్యా బాబోయ్ ఈ దోమల బాధలు తీరేది ఎన్నడో?

by Kalyani |
అయ్యా బాబోయ్ ఈ దోమల బాధలు తీరేది ఎన్నడో?
X

దిశ, చింతలపాలెం : అయ్య బాబోయ్ ఈ దోమలతో బస్టాండ్ వాసులు రోజు సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దోమల నుంచి విముక్తి కలిగేదన్నడు అని ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో దోమల బాధతో స్థానిక ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం ఆరు అయితే చాలు ఇక బస్టాండ్ సెంటర్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం గతంలో వేసిన సైడ్ డ్రైనేజీల పుణ్యమేనని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

డ్రైనేజీలో వాటరు మట్టి పేరు కొనిపోయి డ్రైనేజీలో నీరు బయటికి పోవడానికి అవకాశం లేకపోవడంతో ఆ నీరు నిల్వ ఉండటం వలన విపరీతంగా దోమలు వస్తున్నాయి. ఈ డ్రైనేజీలపై ఇప్పటివరకు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వర్షాకాలంలో డ్రైనేజీలు మరమ్మతులు చేసి దోమల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కు ఫోన్ లో వివరణ కోరగా స్పందించలేదు.

Next Story

Most Viewed