టైంకు రాలేదని కౌన్సిలర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన లేడీ డాక్టర్

by Bhoopathi Nagaiah |
టైంకు రాలేదని కౌన్సిలర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన లేడీ డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో ఓ లేడీ డాక్టర్ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రాలేదని ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హజిపూర్‌కు చెందిన 25 ఏళ్ల వయసున్న మహిళా వైద్యురాలు మధౌరాలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలోని మధురా బ్లాక్ 12వ వార్డు కౌన్సిలర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రియుడు మాత్రం వివిధ కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో లేడీ డాక్టర్ అతడిని బలవంతపెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకునేందుకు ఒప్పించింది. అయితే సోమవారం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లిన వైద్యురాలు ప్రియుడి కోసం ఎదురు చూసింది. అతడు రాకపోగా.. ఫోన్ చేసిన స్పందించకుండా స్విచ్ఛాప్ చేశాడు. సాయంత్రం వరకు నిరీక్షించిన వైద్యురాలు ఇంటికి తిరిగి వచ్చింది.

ఇవాళ ఉదయం ఇంటికి వచ్చిన ప్రియుడితో ఎందుకు రాలేదంటే గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ప్రియుడు బెడ్ రూంలోకి వెళ్లి పడుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన వైద్యురాలు బెడ్‌పై పడుకోని ఉన్న కౌన్సిలర్ మర్మంగాన్ని కట్ చేసింది. ప్రియుడు అరుపులు విని స్థానికులు వచ్చారు. వారి సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కౌన్సిలర్‌ను హాస్పిటల్‌కు తరలించి వైద్యురాలిని కస్టడీలోకి తీసుకున్నారు.

Next Story