సంపూర్ణత అభియాన్ లక్ష్యాన్ని సాధించాలి : జిల్లా కలెక్టర్

by Aamani |
సంపూర్ణత అభియాన్ లక్ష్యాన్ని సాధించాలి  : జిల్లా కలెక్టర్
X

దిశ,ఆసిఫాబాద్ : జిల్లాలో సంపూర్ణత అభియాన్ లక్ష్యాన్ని సమిష్టి కృషితో సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. డీఎఫ్ వో నీరజ్ కుమార్. డీఆర్డీవో సురేందర్ లతో కలిసి ప్రజాప్రతినిధులు నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లక్ష్య సాధన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ లో భాగంగా వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా వైద్యం, వ్యవసాయం స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత అంశాలపై సంపూర్ణత అభియాన్ ద్వారా ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలకు, గర్భిణీ, బాలింత మహిళలకు సక్రమంగా పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు. దవాఖానాల్లో సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed