- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
తల్లి కాబోతున్న యంగ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్
దిశ, సినిమా: ‘ఏడుకొండలవాడా అందరూ బాగుండాలి’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హర్షిక పూనాచా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అప్పుడలా ఇప్పుడిలా’ అనే మూవీలో నటించి మెప్పించింది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, భోజ్పురి వంటి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇక హీరోయిన్గా చేస్తునే గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీని కూడా రన్ చేస్తుంది. ఇందులో పార్ట్నర్గా ఉన్న నటుడు భువన్ పొన్నానను ప్రేమించి గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అందులో హలో అందరికీ.. ఇప్పటి వరకు మా ఇద్దరి పైన చూపించిన మీ ప్రేమకు కృతజ్ఞతలు.. ఇప్పడు అదే మీ ప్రేమ ఆశిస్సులు మాకు పుట్టబోయే బిడ్డపై కూడా ఉండాలని కోరుకుంటున్నాము. మేము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నాము. అక్టోబర్లో వచ్చే మా బుజ్జి పాపాయి కోసం ఎదురుచూస్తున్నాము అంటూ పోస్ట్ పెట్టింది. అదే విధంగా భర్తతో ఉన్న డిఫరెంట్ ఔట్ ఫిట్తో ఉన్న ప్రెగ్నెన్సి ఫోటోలు కూడా రివీల్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.