యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్..

by sudharani |   ( Updated:2023-11-06 07:38:32.0  )
యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభం స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనము అందజేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. అక్టోబర్‌ 18న త్రిపుర గవర్నర్‌గా నియమితులైన ఆయన, 26న గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story