- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్ బనేగా మార్కెట్ కమిటీ చైర్మన్.. ఎమ్మెల్యే ప్రకటనపై ఉత్కంఠ..!
దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రకటనపై కొనసాగుతున్న జాప్యం పలువురిలో ఉత్కంఠత రేపుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగు మాసాల క్రితం తిరుమలగిరి, శాలిగౌరారం, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలిల పదవి కాలం పూర్తి అయ్యింది. కాగా, ఇందులో రెండు మాసాల క్రితమే తుంగతుర్తిని మినహాయిస్తే మిగతా రెండు మార్కెట్లకు పాలక మండలి కమిటీల ప్రకటన వెలువడింది. అయితే మధ్యలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక అడ్డంకిగా మారడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నెలరోజుల పాటు వాయిదా పడ్డాయి. చివరికి దాదాపు 20 రోజుల వ్యవధిలో శాలిగౌరారం, తిరుమలగిరి మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది తుంగతుర్తి మాత్రమే.. అయితే తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు.
ఈ పదవి దక్కించుకోవడానికి పెద్ద దిక్కుగా నిలిచిన స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆశీస్సుల కోసం పలువురు పోటీలు పడుతున్నారు. అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే పాలకమండలి కమిటీని ఎన్నిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. అయితే చైర్మన్ పదవి ఆశిస్తున్న వారిలో తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా పరిస్థితులు చక్కబడేంతవరకు అధికారిక ప్రకటన వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మార్కెట్ కమిటీ పాలకమండలి కమిటీ భర్తీ ఎప్పుడని ప్రశ్నించగా.. త్వరలోనే ప్రకటిస్తామని ఎమ్మెల్యే చెప్పిన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. చైర్మన్ పదవి తమకే వస్తుందంటూ ఆశావాహులు ఎవరికి వారే చెప్పుకోవడం విశేషం.