- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీడర్ ఛానల్ ఆధునీకరణ సర్వేలు చేసిన ఇంజనీరింగ్
దిశ,తుంగతుర్తి: గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరిన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పరిధిలో ఉన్న కేతిరెడ్డి ఆనకట్ట ఫీడర్ ఛానల్ ఆధునీకరణ కోసం నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు తయారు చేశారు. మొత్తంగా మామిడాల పాత మత్తడి నుంచి గొట్టిపర్తి గ్రామ చెరువు వరకు ఉన్న ఆరున్నర కి.మీ దూరాన్ని సర్వే చేశారు. ఆనకట్ట ఏర్పాటుకు రూ.13.50 కోట్ల కానున్నట్లు తేల్చారు. దాదాపు 50 ఏళ్ల క్రితం మామిడాల వద్ద ఉన్న పాత మత్తడి కాలానుగుణంగా శిథిలావస్థకు చేరింది. అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అయితే దీన్ని ఆధునికరిస్తే వేలాది ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి వస్తాయని స్థానికులు తెలిపారు. కాగా ఇటీవలే మామిడాల నుంచి గొట్టిపర్తి వరకు ఉన్న ఫీడర్ ఛానల్ ను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిలుకల వెంకన్న,పార్టీ ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న (బిఎన్) సూచన మేరకు ఎమ్మెల్యే మందుల సామెల్ స్వయంగా అధికారులతో కలిసి తిరిగి పర్యవేక్షించారు. అనంతరం ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఇందులో భాగంగానే ఎస్ఈ శివధర్మ తేజ,ఈఈ సత్యనారాయణ,డిఈ నవీన్ కుమార్, ఏఈ శ్రీకాంత్,తదితరులంతా ఫీడర్ చానల్ ను పర్యవేక్షించారు. ముఖ్యంగా ఈ ఫీడర్ ఛానల్ వల్ల కుంటపెళ్లి,మద్దిరాల,ముకుందాపురంతో పాటు..దాదాపు 10 గ్రామాలకు నీటి వసతిపరంగా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పట్నం ఎల్లేష్,కొండ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.