- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత రాజ్యాంగం ఒక జీవన విధానం.. రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భారత రాజ్యాంగం కేవలం లిఖితపూర్వకమైన డాక్యుమెంటే కాదు అది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన అనంతరెడ్డి నగర్, కొండపల్లి ఉత్తమ కుమార్ ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు జే. విద్యాసాగర్ అధ్యక్షతన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ముందుగా అఖిలభారత న్యాయవాదుల సంఘం జెండాను సీనియర్ న్యాయవాది ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు కొత్త బుచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి సాధారణ వృత్తి కాదన్నారు. రాజ్యాంగంలో రాసిన, పేర్కొన్న ఏకైక వృత్తి అని తెలిపారు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎంటర్ అయినప్పుడు చేసిన శపధం మరోసారి అందరం చదువుకోండి అని కోరారు.
భారత రాజ్యాంగంలో పౌర హక్కులు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాజ్యాంగం కాపాడె బాధ్యత మన పై ఉందన్నారు. ఇది ఉన్నతమైన వృత్తి అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ లు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, ఏఐఎల్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఐలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిలు కొల్లి సత్యనారాయణ, నర్రా శ్రీనివాసరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంకటరెడ్డి, ఎండి ఇస్మాయిల్, కే. సోమయ్య, చింతల రాజశేఖర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రావుల రవీందర్ రెడ్డి బాబురావు కేశవరెడ్డి, లింగారెడ్డి, జగత్, బొల్లెపల్లి కూమార్, మెహన్, ఎండి నిహాల్, బోడ్డు కిషన్, వెదేశ్వర్, శంకర్, ఐలయ్య, గొలనుకొండ లింగయ్య, పాల్గొన్నారు.