- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అమెరికా అందాల పోటీలో చండూరు అమ్మాయి..
దిశ,చండూరు : అమెరికాలో ప్రవాస ఆంధ్రుల, భారతీయుల హవా రోజురోజుకు పెరుగుతూ పోతుంది. అమెరికా రాజకీయాలల్లో కూడా భారతీయుల ప్రాబల్యం పెరిగిపోతుంది. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన బావండ్ల రిషిత అమెరికా అందాల పోటీలల్లో గెలుపొంది మరోసారి తెలుగు వారి సత్తాను చాటి చెప్పింది . 2024-25 సంవత్సరానికి గాను నవంబర్ 11న వాషింగ్టన్ లో జరిగిన మిస్ టీన్ ఇండియా డబ్ల్యూ ఏ, మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ పోటీలలో గెలుపొంది ఈ నెల 14 న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి బావండ్ల మాణిక్యం తెలిపారు. భరతనాట్యం అరంగ్రేటంలోనే నిర్వీరామంగా మూడు గంటలు ఆమె నాట్యం చేయటం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
కరాటే లో కూడా బ్లాక్ బెల్ట్ విభాగంలో ఆమె ప్రావిణ్యం సంపాదించినట్లు తెలిపారు.బావండ్ల రామలచ్చయ్య సత్తమ్మల మూడవ కుమారుడైన బావండ్ల మాణిక్యం పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో ఉంటూ భారతీయ సంప్రదాయాలు కొనసాగిస్తూ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ చండూరు కు చెందిన యువతి అమెరికా అందాల పోటీల్లో విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25న ఆమె చండూరు కు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.