- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరిన మునుగోడు కాంగ్రెస్ నేత..
దిశ, సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పీసీస ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరిన చలమల కృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ కండువాను కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినా చివరకు పాల్వాయి స్రవంతికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఆమె గెలుపు కోసం కృషి చేశారు.
ప్రస్తుతం జరగనున్న సాధారణ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని భావించిన చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకే అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మునుగోడు బరిలో తప్పక నిల్చుంటానని ఆయన అనుచరులకు మీడియా ముఖంగా తెలిపారు. చివరకు బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి మునుగోడు టికెట్ కేటాయింపు హామీతోనే ఢిల్లీలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం.