- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సెంట్రల్ టీం
దిశ,చౌటుప్పల్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం పై సెంట్రల్ టీం బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో జాయింట్ రివ్యూ మిషన్ సెంట్రల్ టీం అధికారులు భుపెంద్ర కుమార్, దినేష్ ప్రధాన్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి పాఠశాలలలో ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో పాల్గొంటున్నారు, వారికి ఎటువంటి భోజన వసతులు కల్పిస్తున్నారు, బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారా లాంటి వాటిపై చర్చ సాగించారు. మధ్యాహ్న భోజనంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఎంఈఓలను అడిగి తెలుసుకున్నారు. చౌటుప్పల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంబంధించి కిచెన్ రూం , బియ్యంను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం పరిశీలించారు. యాదాద్రి జిల్లాలో మూడు రోజుల పాటు ఈ తనిఖీలు ఉంటాయని మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ ,పోచంపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇబ్బందులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేలా ఈ టీమ్ వ్యవరిస్తుందని పేర్కొన్నారు. ఈ తనిఖీలో మొదట విద్యార్థుల బరువు తూకం వేసి తర్వాత వారికి అందించే భోజనం తూకం వేసి, తిన్న తర్వత మళ్ళీ తూకం వేసి బరువుని లెక్కిస్తామని తెలిపారు. తెలంగాణలో తక్కువ విద్యార్థులు ఎన్ రోల్ చేసుకున్న పాఠశాలలో వంట సిబ్బంది కి ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసాద్, డీఈఓ నారాయణ రెడ్డి, జిల్లాలోని ఎంఈఓలు ,జిల్లా విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.