- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
దిశ నకిరేకల్ : తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, రాబోయే రోజుల్లో ఢిల్లీ గడ్డపై తెలంగాణ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. అధికార అండతో ఈడి, సీబీఐలను వాడుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన తెలంగాణ సమాజమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. నకిరేకల్ పట్టణంలో 32 కోట్ల రూపాయలతో నిర్మించే వంద పడకల ఆసుపత్రి, 22 కోట్ల రూపాయలతో చేపట్టే హైవే నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి శుక్రవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకెళ్తుందని తెలిపారు. అత్యాధునిక హంగులతో త్వరలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించి ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. అదేవిధంగా నకిరేకల్ _ తిప్పర్తి రోడ్డుకు 80 లక్షల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలతో పాటు దేశమంతా తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం నార్కట్ పల్లి పట్టణంలో 50 మంది లబ్ధిదారులకు మంజూరైన 16 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నార్కట్పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
- Tags
- nalgonda