- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియాగాంధీ ఆధ్వర్యంలో బీసీలకు భయంకరమైన మోసం జరిగింది: ఎమ్మెల్సీ కవిత
దిశ, నల్లగొండ: బీసీల హక్కుల సాధనకై నల్లగొండలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1931లో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో కుల గణన చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మాములుగా జనాభా లెక్కలు తీయలేదు అన్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది అన్నారు. అనేక మంది మేధావులుకు బీసీలకు న్యాయం జరగాలి అని అన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు కుల గణన చేయలేదు. కుల గణన పెరున 2006 లో ఖర్చు పెట్టిన 4500 కోట్ల వృధా అయ్యాయి అన్నారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో భయంకరమైన మోసం బీసీలకు జరిగిందన్నారు. ఏ ఒక్క కమిషన్, కమిటిలు నివేదికలు ఇవ్వలేదు అన్నారు. బీసీలు అందరూ కూడా మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి అన్నారు.
మన బీసీలు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలని తెలిపారు. మొదటగా పూలే విగ్రహం అసెంబ్లీ లో పెట్టాలని భారత జాగృతి ఆధ్వర్యంలో కోరుతున్నాం అన్నారు.48 గంటల దీక్ష చేసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టేలా చేశామని అన్నారు. పార్లమెంట్ లో పూలే విగ్రహం ఉన్నది మరి అసెంబ్లీలో ఎందుకు పెట్టారు అని అడిగారు. చట్టం చేసి కుల గణన చేయాలి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానం తూతూ మంత్రం గా చేశారు. కుల గణన చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలి అన్నారు. బీసీ సబ్ ప్లాన్ చేయాలన్నారు. తొలి బడ్జెట్లో ఎంబీసీలకు స్థానం లేదు.
అన్ని జిల్లాల్లో బీసీలతో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అన్నారు. పూలే జయంతి కి ఇంకా ఒక నెల మాత్రమే మిగిలి ఉంది అన్నారు. ఉద్యమ కార్యచరణ తో ముందుకు వెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు జూలూరి గౌరీశంకర్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, షీప్, గోట్స్ కమిషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్, రాజారామ్ యాదవ్, గట్టు రాం చందర్ రావు అలాగే నల్లగొండకు చెందిన బీసీ సంఘాల నాయకులు బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.