- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్నం వేధింపులకు నిండు జీవితం బలి
దిశ, పెన్ పహాడ్: భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపాటి అన్నారం గ్రామంలో పిండిప్రోలు అయోధ్య, సునీత దంపతుల కూతురు చందన శుక్రవారం తమ పుట్టింటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త వేణు కొత్తగూడెం ఖమ్మంలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి 18 నెలలు (బాబు ) ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి మృతురాలు చందనను తన భర్త, అత్త విజయలక్ష్మి అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అయినా భర్త చందనను అదనపు కట్నం గురించి ఫోన్‌లో వేధిస్తూ, అదేవిధంగా గత సంవత్సరం తనపై పెట్టిన కేసు రాజీ పడాలని బెదిరిస్తు ఉండగా తట్టుకోలేక గురువారం రాత్రి తన పుట్టింట్లో పైకప్పులో ఉన్న రాడ్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రవి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.