నేడు ఆస్ట్రేలియాకు MP కోమటిరెడ్డి.. తిరిగొచ్చేది అప్పుడే!

by GSrikanth |   ( Updated:2022-10-21 05:17:09.0  )
నేడు ఆస్ట్రేలియాకు MP కోమటిరెడ్డి.. తిరిగొచ్చేది అప్పుడే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం వేడివేడిగా సాగుతోంది. బీజేపీ తరపున కేంద్ర మంత్రులు ప్రచారానికి రంగంలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రులు పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నారు. అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. మునుగోడు ప్రచారానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రావడం లేదనేది స్పష్టమైంది. ఇటీవల కోమటిరెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఎట్టకేలకు వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మళ్లీ నవంబర్‌ 7న తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలందరూ ఎంత చెప్పినా ఆయన మాత్రం వినకుండా విదేశాలు వెళుతున్నారు. కాగా, ఈనెల 15న కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కుటుంబంతో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే, తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరుపున మునుగోడు ఎన్నిక బరిలో ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరుపున ప్రచారం చేయాల్సి వస్తుందనే నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళుతున్నట్లు ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజగోపాల్ బ్రదర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశాలకు వెళ్లడం కార్య కర్తల్లోనూ ఆగ్రహం తెప్పిస్తుంది. ముందు నుండి కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి రాను అనే సమాధానం చెపుతూ వచ్చారు. రీసెంట్‌గా కూడా ప్రచారంలో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చారు. మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపిస్తాడు.. నాతో ఏం పని? నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో వెంకట్‌రెడ్డి విదేశీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలినట్లైంది.

Advertisement

Next Story

Most Viewed