Patnam: కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఆధారాలతో రండి.. ఫామ్ హౌస్ ఆరోపణలపై పట్నం మహేందర్ రెడ్డి

by Prasad Jukanti |
Patnam: కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఆధారాలతో రండి.. ఫామ్ హౌస్ ఆరోపణలపై పట్నం మహేందర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నదంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మండి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఖండించారు. నా ఫామ్ హౌస్ అక్రమమైతే నేనే కూల్చివేస్తానన్నారు. నా ఫామ్ హౌస్ అక్రమమైతే ఆధారాలాలతో రావాలన్నారు. అప్పుడు నేనే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నా ఫామ్ హౌస్ బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో లేదని, 111 జీవో పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం ఈ జీవో అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. దాన్ని 20 ఏళ్ల క్రితమే నిర్మించానని చెప్పారు. నా ఫామ్ హౌస్ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో లేదని తాను ఇది వరేకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పదే పదే తనపై ఆరోపణలు చేస్తున్నారని అందువల్లే నిజాలను ప్రజలకు వివరించేందుకు మళ్లీ మీడియా ముందుకు వచ్చానన్నారు. ఇల్లీగల్ నిర్మాణాలు ఎవరిదైనా కూల్చాల్సిందేనన్నారు. అది తనదైనా కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఎవరిదైనా కూల్చాలన్నారు. పార్టీ తానొక్కడినే మారలేదని, చాలా మంది అటు ఇటు వెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను ఓ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తిగా భవనాన్ని నిర్మించినప్పడే అన్ని అనుమతులతోనే నిర్మించానన్నారు. ప్రభుత్వ మ్యాప్ ల్లో కూడా తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో లేదన్నారు. ఒక వేళ ఈ నిర్మాణం అక్రమమని నోటీసులు ఇస్తే కూల్చివేస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed