చట్టాల‌పై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి

by Sathputhe Rajesh |
చట్టాల‌పై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి
X

దిశ,వనపర్తి : పౌరులు చట్టాల‌పై అవగాహన కలిగి ఉండడం ద్వారా శాంతియుత జీవనానికి తోడ్పాటునందిస్తుందని జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమిట్ట గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి హాజరయ్యారు. ఎస్పీ గ్రామ మహిళలు, యువకులు,నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి మాట్లాడుతూ.. పౌరులు చట్టాలపై అవగాహన కలిగి జీవించడం ద్వారా శాంతియుత జీవనం కొనసాగించవచ్చునన్నారు. కనిమెట్ట గ్రామం జాతీయ రహదారి సమీపంలో ఉన్నందున రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు రహదారిని దాటే క్రమంలో ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు సత్వరమే ఏర్పాటు చేయాలని ఎస్ఐని ఆదేశించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

విద్యాబుద్దులతో సన్మార్గంలో నడవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమస్య ఉంటే నేరుగా తనను డిఎస్పీ, సీఐలను నిర్భయంగా కలువచ్చు అని అన్నారు. అనంతరం ఎస్పీ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక, కనిమెట్ట సర్పంచ్ బాదం రాణి, డిఎస్పి ఆనంద్ రెడ్డి, కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగ శేఖర్ రెడ్డి, కనిమేట్ట గ్రామ అధ్యక్షుడు కోటేశ్వర్ రెడ్డి, గ్రామ మహిళాధ్యక్షురాలు మంజులత, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story