- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫామ్ హౌస్‌లో నిమ్మకాయలతో KCR తాంత్రిక పూజలు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకాయలు పెట్టి తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు జనం మీద కానీ, వారు వేసే ఓట్లపై కానీ నమ్మకం లేదని, అందుకే వశీకరణను నమ్ముకున్నాడని వ్యాఖ్యానించారు. పూజలు చేస్తే తప్పు లేదని, అయితే అవి జనహితం కోసం చేస్తే ఫలిస్తాయని వెల్లడించారు. అంతేకానీ ఇంకొకరి నాశనం కోసం చేసే పూజలు ఫలించవని పేర్కొన్నారు. మోటార్లు మునిగిపోయినా, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినా, అన్నారం లీక్ అవుతున్నా ముఖ్యమంత్రి మాట్లాడలేదని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
దేశం మొత్తం తిరిగి కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్నారని, నదులకు నడకలు నేర్పిన నేత అని చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నదిలో ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీ చేశారని బండి ఆరోపణలు చేశారు. లేకేజీ, పగుళ్ళ విషయంలో సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. అసెంబ్లీలో టోపీ పెట్టుకుని, కర్ర పట్టుకుని ప్రొజెక్టర్ చూపిస్తూ చెప్పిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ నాణ్యతపై లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
తాంత్రిక పూజల ద్రవ్యాలు కలపడం కోసమో, కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల కోసమో సీఎం.. ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తారు తప్ప నాణ్యత పరిశీలించడం కోసం కాదని ఫైరయ్యారు. నాణ్యత లోపం కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని, తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నా.. కేసీఆర్ ఎవరి మాట వినలేదని బండి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్.. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కుంగిపోవడం.. విద్రోహ చర్య అంటున్నారని, అయితే వైఫల్యం ఎవరిది? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.