- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Yennam: కేసీఆర్ కుటుంబం ఖలిస్తాన్ తీవ్రవాదుల కన్నా డేంజర్.. ఎమ్మెల్యే యెన్నం ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫార్మా కంపెనీ (Pharma Company) ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ (Pratik Jain), అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పోలీసులు మొత్తం 50 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ (Parigi Police Station)కు తరలించారు. అదేవిధంగా కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన కొడంగల్ కోర్టు (Kodangal Court)లో హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ క్రమంలోనే అధికారుల దాడిపై మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. లగచర్ల దాడి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే (KTR) ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. దేశానికి ఖలిస్తాన్ తీవ్రవాదులు (Khalistan Terrorists) ఎంత ప్రమాదకరమో.. తెలంగాణ (Telangana)కు కేసీఆర్ (KCR) కుటుంబం అంతే ప్రమాదమని ఫైర్ అయ్యారు. అదేవిధంగా కశ్మీర్ (Kashmir) తీవ్రవాదులు ఎంత డేంజరో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కూడా అంతే డేంజరని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం పక్కా అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.