KCR తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం: MLA శ్రీనివాస్ రెడ్డి ఫైర్

by Satheesh |
KCR తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం: MLA శ్రీనివాస్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పదేళ్ల అవినీతి అక్రమాలపై చర్యలు తప్పవని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని..? ప్రశ్నించారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, కేసీఆర్ అధిక ధరకు కొన్నాడని మండిపడ్డారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు నిజాలు బట్టబయలు అవుతాయనే కేసీఆర్ హాజరు కావడం లేదన్నారు. విద్యుత్ ఒప్పందాలలో తీసుకున్న కమిషన్ బయటకు వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. సొంత లాభం లేనిదే కేసీఆర్ ఏ పనిచేయడన్నారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా రూ.30 వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడిందన్నారు.

Next Story

Most Viewed