ఇదేనా బంగారు తెలంగాణ..? సర్కార్‌పై MLA రఘునందన్ రావు ఫైర్

by Satheesh |   ( Updated:2023-08-19 09:55:12.0  )
ఇదేనా బంగారు తెలంగాణ..? సర్కార్‌పై MLA రఘునందన్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళితులు రోడ్డెక్కరని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. డబుల్ ఇండ్లు ఇంకెప్పుడిస్తారు?, రోడ్డెక్కిన దళితులు అంటూ ‘దిశ పేపర్’లో వచ్చిన వార్తలపై రాఘునందన్ రావు ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళితులు రోడెక్కరని తెలిపారు. దళిత బంధు పథకంలో అన్యాయం జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

9 ఏళ్లుగా గడిచిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారు అని మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు చేశారని వివరించారు. దేవాదాయ భూమిలో అక్రమ నిర్మాణాలు కడితే మంత్రి ఎందుకు పట్టించుకోరు అని ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వివరించారు. నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా అంటూ ఎమ్మెల్యే, మంత్రులపై తిరుగుబాటు చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలు, ఓట్ల రాజకీయం తప్ప పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story