- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొమ్మల రామారం పీఎస్ వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బొమ్మల రామారం పీఎస్ వద్దకు చేరుకున్న రఘునందన్ రావుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ అర్థం మార్చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. మరో వైపు ఎగ్జామ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ బయటికొస్తే లీక్ ఎలా అవుతందని ప్రశ్నించారు.
కాగా పీఎస్ వద్ద పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ అరెస్ట్, పేపర్ లీకుల ఘటన నేపథ్యంలో పలు జిల్లాల్లో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులను హౌజ్ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి: బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్