- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: దమ్ముంటే ఫార్ములా వన్ మీద చర్చ పెట్టండి.. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congrss) ప్రభుత్వానికి బీఆర్ఎస్(BRS) నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సవాల్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఓ ప్రహసనంగా మార్చేసిందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వీర్యం చేశారని అన్నారు. శాసనసభ రూల్ బుక్ ప్రకారం నడవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులకు బేడీలపై రెండు రోజులుగా చర్చకు పట్టుబడుతున్నాం అయినా ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు.
కేటీఆర్(KTR) అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డే మీడియాకు లీకు లిచ్చి బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్(Formula E-Race) మీద దమ్ముంటే చర్చ పెట్టండి అని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే శాసనసభను పదిహేను రోజులు నడపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయంలో చేసిన ప్రతీ పనిని చర్చిద్దామని అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల గొంతును నొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందని అన్నారు.