HYD : మైనర్​ బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

by Rajesh |
HYD : మైనర్​ బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
X

దిశ, చార్మినార్​: 15 సంవత్సరాల మైనర్​ బాలికపై ఓ మైనర్​ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన మైనర్​బాలిక ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ మైనర్​యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన 15 సంవత్సరాల మైనర్​బాలికపై అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్​ యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మైనర్​ బాలిక గర్భం దాల్చింది. ఈ నెల 3వ తేదీన నీలోఫర్​ ఆసుపత్రిలో సదరు మైనర్ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో బాలిక ఫలక్​నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనర్​యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed