- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల స్పష్టత
దిశ, వెబ్‌డెస్క్: రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 మంది రుణ ఖాతాల్లో నిధులు జమ చేశామని తెలిపారు. మొత్తంగా రూ.17933.19 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ఏదైనా కారణంతో రుణమాఫీ కాకపోతే ఆ రైతుల వివరాలు సేకరిస్తామని అన్నారు. వివరాలు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు చెప్పామని తెలిపారు. రైతుల సంక్షేమానికి ఇప్పటికే రూ.26,140.13 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించామని అన్నారు. సూక్ష్మ సేద్యం, ఆయిల్‌పాం, పలు రాయితీల బకాయిలులు చెల్లించినట్లు తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని అన్నారు. దిగజారుడు రాజకీయాలు తమకు రావని అసహనం వ్యక్తం చేశారు.