- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Thummala: ఆధిపత్యం కోసమే బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు.. ప్రతిపక్షాలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwara Rao) ఆరోపించారు. ఇవాళ సచివాలయం (Secretariat)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్లను పండించారని తెలిపారు. 28 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 9.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారి ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కోనుగోలు కొనసాగుతోందని అన్నారు. అయినా బీజేపీ (BJP) రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపిస్తే.. సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe) నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా (Raithu Bharosa) కూడా ఇస్తామని అన్నారు. పార్టీలు రైతుల మధ్య చిచ్చుపెట్టి శునకానందం పొందకూడదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.