- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Sridhar Babu: ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు చేస్తున్న కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొడతామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లడుతూ.. ఓ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే పరిశ్రమల ఏర్పాటు కీలకమని అన్నారు. తెలంగాణ (Telangana) అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ (BRS), బీఆర్ఎస్ (BRS) పార్టీలు అడ్డుపడుతున్నాయని కామెంట్ చేశారు. లగచర్ల (Lagacharla)లో అమాయక రైతులను అడ్డుపెట్టుకుని భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ (Collector), అధికారుల (Officers)పై బీఆర్ఎస్ (BRS) దాడులు చేయించిందని ఫైర్ అయ్యారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని.. ఆ శుభ పరిణామాన్ని విపక్షంలో ఉన్న ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని కామెంట్ చేశారు. లగచర్ల (Lagacharla) ఘటనలో ఎంతటి వారు ఉన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితులపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల అభివృద్ధికి కోసం ప్రజాపాలనను కొనసాగిస్తామని.. ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లబోమని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పష్టం చేశారు.