- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ.. మాటిచ్చాం చేసి చూపిస్తున్నాం: మంత్రి పొన్నం
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులందరికీ ఏకకాలంలోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రుణమాఫీ ద్వారా 47 లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభించనుందని వెల్లడించారు. దీంతో తెలంగాణ రైతులకు భారీ ఊరట లభించింది. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్లు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. దీనిపై తాజాగా మంత్రి పొన్నం స్పందించి.. ‘రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పదు.. మొదటి నుంచి ఒకే మాట.. ఇప్పుడు అదే మాట. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని రైతులందరికీ హామీ ఇచ్చాం. నెరవేర్చే సమయం వచ్చింది. మాటిచ్చాం చేసి చూపిస్తున్నాం’ అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story