- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి పొంగులేటి
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రాపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే హైడ్రాను ప్రారంభించామని, ఆ కోణంలోనే ఆక్రమణలను తొలగించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో చెన్నై, బెంగళూరు కాకూడదనే హైదరాబాద్‌లోని చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతున్నామని, అంతేకానీ ఎవనిరీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైడ్రా కేవలం అక్రమంగా ఆక్రమించుకున్న లేదా కబ్జాలు చేసి కట్టిన భవనాలను మాత్రమే కూలుస్తోందని మంత్రి తెలిపారు. చివరిగా హైడ్రాకు అందరూ సహకరించాలని, ఆక్రమణలకు పాల్పడినవారే స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలను నిలువరించేందుకు ప్రతిపక్షాలు కూడా లీగల్ మార్గాలను వెతుకుతున్నాయి. న్యాయపరంగా హైడ్రాను అడ్డుకోవడానికి ఏమైనా దారులున్నాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నాయి.