- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు.. BRS గెలిచే సీట్ల సంఖ్య తేల్చిచెప్పిన KTR
దిశ, డైనమిక్ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బీష్ అని కొట్టిపారేశారు. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే దిక్కుమాలిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ఇన్ఫ్లూయెన్స్ చేసేలా చేయడం ఏంటన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే మీడియా డిసెంబర్ 3 తర్వాత క్షమాపణలు చెప్తారా? అని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడీయాతో మాట్లాడిన కేటీఆర్.. ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని అనుకోవడం లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ మాకు వ్యతిరేకంగా ఉండటం ఇదేం తొలిసారి కాదన్నారు. 2018లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందన్నారు. ఎగ్జిజ్ పోల్స్ చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 80కి పైగా స్థానాలు వస్తాయనుకున్నాం, కానీ 70 స్థానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదన్నారు.. ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.