- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై 'వడ్ల' పోరు.. టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: వరి కొనుగోళ్ల వ్యవహారంపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఎల్లుండి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతులను అవమానించినందుకు నిరసనగా ఆందోళనలు చేపడతామని, ఈ నెల 6న జాతీయ రహదార్లపై రాస్తారోకో చేపడతామన్నారు.
విజయవాడ, ముంబై, బెంగళూరు హైవేలపై రాస్తారోకోలు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసలు చేపడతామన్నారు. 8న ప్రతీరైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో కేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని సూచించారు. ఈ నెల 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెళతారని ప్రకటించారు. కేంద్ర వైఖరిని ఢిల్లీలో ఎండగడతామని కేటీఆర్ తెలిపారు.