KVR: విద్యార్థిని చదువుకు అండగా మంత్రి కోమటిరెడ్డి.. కాలేజ్ ఫీజు అందజేత

by srinivas |   ( Updated:2024-10-30 11:03:49.0  )
KVR: విద్యార్థిని చదువుకు అండగా మంత్రి కోమటిరెడ్డి.. కాలేజ్ ఫీజు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) మంచి మనసు చాటుకున్నారు. ఎంబీబీఎస్‌లో సీటు సాధించి కాలేజీ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్న పేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్‌కి చెందిన కాట్రాజ్ సుమలత(Katraj Sumalatha) ఇటీవల MBBS సీటు సాధించారు. అయితే కాలేజీ ఫీజు(College fees) కట్టేందుకు సుమలత కుటుంబం ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థిని సుమలతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సుమలత చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పారు. ఈ మేరకు విద్యార్థిని కాలేజీ ఫీజును ప్రతీక్ ఫౌండేషన్(Prateek Foundation) ద్వారా అందజేశారు. ఈ ఏడాది కాలేజీ ఫీజుతో పాటు పుస్తకాలు, బట్టలు, ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్థి సుమలత, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed