రోడ్ల డ్యామేజీపై మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు

by Anjali |
రోడ్ల డ్యామేజీపై మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వానాకాలంలో ఏర్పడే రోడ్ల డ్యామేజీలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ విజయవాడ హైవే, సిటీ రోడ్లపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్యామేజీ పనుల్లో స్పీడ్ పెంచాలన్నారు. రోడ్లపై లాగిన్ పాయింట్లు రిపేర్లపై చర్చించారు. వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు. పెండింగ్ ఫ్లైఓవర్లు నిర్మాణం, చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదల గురించి.. దానికి ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో గైడ్ చేశారు. 17 బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా డిస్కస్ చేశారు. ఈ మీటింగ్‌కు నేషనల్ హైవే, గ్రేటర్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed