KCR చేసిన అప్పుకి ప్రతినెల రూ.5 వేల కోట్లు ఇంట్రెస్ట్: మంత్రి జూపల్లి

by Satheesh |
KCR చేసిన అప్పుకి ప్రతినెల రూ.5 వేల కోట్లు ఇంట్రెస్ట్: మంత్రి జూపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని.. ఆయన చేసిన అప్పులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తోందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ.70 వేల కోట్లు మాత్రమేనని, పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ చేసిన అప్పు రూ.7లక్షల కోట్లు అని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి శనివారం భిక్కనూరులో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. రైతులు పంటలు వేసుకునే సరైన సమయంలోనే రుణమాఫీ చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు సభలు, ఎన్నికలకే సరిపోయాయని, ఆర్నేళ్లకే ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు అడిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed