కేటీఆర్.. నిజం తెలుసుకుని మాట్లాడు: మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |
కేటీఆర్.. నిజం తెలుసుకుని మాట్లాడు: మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్యపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో సోమవారం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్త మర్డర్‌ను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మల్లేష్ మర్డర్ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని రిమాండ్ చేశారని తెలిపారు. తాను ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని.. మేం చెప్పుడూ చట్ట వ్యతిరేక పనులు చేయలేదన్నారు. మీరు చేసిన చట్ట వ్యతిరేక పనుల వల్లే మీకు ఈ గతి పట్టిందని కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై, తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేటీఆర్ కేసు పూర్వపరాల గురించి.. అన్ని నిజాలు తెలుసుకునే మాట్లాడాలని సూచించారు. ఎన్నికలకు వారం రోజులు ముందు మల్లేష్ బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పారు. నా ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే మరక మీకే అంటుకుందని అన్నారు. కాగా, కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్లలో ఎన్నడూ హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదన్నారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed