ఎండ వేడిమి నుంచి ఉపశమనం.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

by Rajesh |
ఎండ వేడిమి నుంచి ఉపశమనం.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ
X

దిశ, సిటీ బ్యూరో: నైరుతి రుతుపవనాలు ఈ సారి కాస్త ముందుగానే వచ్చే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు ఎండ లు కొడుతూ సాయంత్రం వేళల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు శాఖ పేర్కొంది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా రానున్న మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముండటంతో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గరు నిల్చుండరాదని కూడా సూచించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశమున్నట్లు, వాతావరణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూన్ 1వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళ తీరం దాటి, జూన్ 5,6 తేదీల్ల కల్లా మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

అయిదు విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు

హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పలు జిల్లాలకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో విద్యుత్ శాఖ అయిదు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ సీఎండీ ముషారఫ్ ఫారుఖి గురువారం వెల్లడించారు. వీటిల్లో హైదరాబాద్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9491629047, హైదరాబాద్ సౌత్ 9491628279, సికిందరాబాద్ 9491629380, బంజారాహిల్స్ 9491633294, సైబర్ సిటీ 9493193149 లతో పాటు ప్రజలు ఫిర్యాదులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం 1912,100 లకు కూడా కాల్ చేయవచ్చునని ముషారఫ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed