- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైడ్రా స్పందించేనా..మైసమ్మ చెరువుకు విముక్తి లభించేనా..?
దిశ,కూకట్పల్లి : చెరువు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను వరుసగా కూల్చి వేస్తుండడంతో నేడు నగరంలో ఎక్కడ చూసి హైడ్రా పేరు వినిపిస్తోంది. దశాబ్దాలుగా కబ్జా కోరుల చేతిలో పడి కుంచించుకుపోయిన చెరువులకు పూర్వ వైభవం లభించనుందని పర్యావరణ ప్రేమికులు, సామాన్య జనం చర్చించుకుంటున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో రియల్టర్లు, కబ్జా కోరుల చేతిలో చిక్కుకుని 149 ఎకరాల అతి పెద్దదిగా పేరున్న మైసమ్మ చెరువు 83 ఎకరాలకు కుంచించుకుపోయింది. ఈ మధ్య మైసమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించడం తో చెరువు పరిరక్షణకు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్న చర్చ ప్రస్తుతం కూకట్పల్లి లో హాట్ టాపిక్‌గా మారింది. కూకట్పల్లి మండల పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట్ గ్రామాల పరిధిలోని 53 ప్రైవేటు సర్వే నంబర్లతో పాటు సర్వే నెంబర్ 893 ప్రభుత్వ సర్వే నంబర్ కలుపుకుని మొత్తం 149 ఎకరాల విస్తీర్ణంలో మైసమ్మ చెరువు ఉంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న మైసమ్మ చెరువును రక్షించేందుకు హైడ్రా ఎటువంటి యక్షన్ ప్లాన్ చేపడుతుంది అన్న అంతుచిక్కని ఉత్కంఠత కూకట్‌పల్లిలో ఉంది.
చెరువు సుందరీకరణలో మతలబు ఏంటి..?
మైసమ్మ చెరువులో సుమారు 20 ఎకరాల వరకు రాజీవ్‌గాంధీ నగర్ కాలనీ వైపు కబ్జా కాగా మిగిలిన కొన్ని సర్వే నంబర్లలో సైబర్‌సిటి, వాసవి నిర్మాణ సంస్థలు అగ్రికల్చర్‌ను నాన్ అగ్రికల్చర్ జాబితాలోకి మార్చుకుని భారి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మిగిలి ఉన్న మైసమ్మ చెరువును సుందరీకరించేందుకు వాసవి నిర్మాణ సంస్థ ముందుకు రావడంతో సీఎస్ఆర్ కింద చెరువు సుందరీకరణ బాధ్యతలు జీహెచ్ఎంసీ, ప్రభుత్వం వాసవి నిర్మాణ సంస్థకు అప్పగించింది. మిగిలి ఉన్న చెరువు చుట్టు కట్టను ఏర్పాటు చేసి కట్ట పొడవునా భారీ పైప్లైన్లను ఏర్పాటు చేసి డ్రైనేజి నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు హైడ్రా చెరువులకు పూర్వ వైభవం తీసుకు రావాలని చూస్తుంటే హడావిడిగా మైసమ్మ చెరువు సుందరీకరణ పనులు చేపట్టడంలో మతలబు బాధపడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలాను కలిపేశారు..
కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు 17 నుంచి 19 మీటర్లు (55 ఫీట్ల నుంచి 62 ఫీట్లు) వెడల్పు, 2.8 మీటర్ల (9.18 ఫీట్లు) లోతు ఉండాల్సిన నాలా ప్రస్తుతం 6 నుంచి 7 మీటర్లు (6 ఫీట్ల నుంచి 22 ఫీట్లు) వెడల్పు మాత్రమే ఉంది. కాముని చెరువు అలుగు నుంచి పారుతున్న నాలాను వాసవి నిర్మాణ సంస్థ భారీ రుకులను ఏర్పాటు చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సహజ సిద్ధమైన నాలాను 6 నుంచి 7 మీటర్ల వెడల్పుతో కృతిమ నాలగా ఏర్పాటు చేసేందుకు వాసవి నిర్మాణ సంస్థ తమ ఒప్పందంలో రాసుకున్నట్టు, దానికి ఇరిగేష్, జీహెచ్ఎంసీ అధికారులు ఒప్పుకున్నట్టు సమాచారం.
గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని వేలం వేసిన గత పాలకులు..
మూసాపేట్ గ్రామం పరిధిలోకి వచ్చే మైసమ్మ చెరువు, కాముని చెరువు మధ్యలో కాముని చెరువు అలుగు కు ఆనుకుని సర్వేనెంబర్ 75 లో ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ హయాంలో వేలం వేశారు. సదరు భూమిని 75 వేల రూపాయలకు గజం లెక్కన వాసవి నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. పక్కనే ఉన్న ప్రైవేటు సర్వే నంబర్లలో వాసవి నిర్మాణ సంస్థ తమ వెంచర్‌ను నిర్మాణ పనులను చేపడుతుంది. ఇదిలా ఉండగా వాసవి నిర్మాణ సంస్థ చేపడుతున్న ప్రైవేటు సర్వే నంబర్లో ఇప్పటికి ధరణిలో వ్యవసాయ భూమిగానే దర్శనమిస్తుంది. భూమి బదిలి కాకముందే నిర్మాణ పనులు చక చక కొనసాగుతున్నాయంటే అధికారులు ఏ రేంజిలో వారికి వంత పాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. మైసమ్మ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్న సైబర్‌సిటి సైబర్‌సిటి ఓరియాన, వాసవి సరోవర్ నిర్మాణ సంస్థలు తమ ఫ్లాట్లను లేక్ వీవ్ పేరుతో విక్రయాలు ప్రారంభించారు. సీఎస్ఆర్ కింద చెరువు సుందరీకరణ చేపడుతూ కోట్లాది రూపాయల వ్యాపారానికి తెరలేపారు.
ప్రమాదం పొంచి ఉంది..
మైసమ్మ చెరువు ఆనుకుని వెలసిన రాజీవ్‌గాంధీ నగర్ కాలనీ తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క సారిగా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వందలాది సంఖ్యలో నిర్మాణాలు వెలశాయి దీంతో చెరువు తో పాటు నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న కున్న వారు తరచు వర్ష కాలంలో ముంపు సమస్యతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. గత రెండేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాజీవ్‌గాంధీ నగర్, సఫ్దర్‌నగర్ కాలనీలో పూర్తిగా నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదురుకున్నరు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజీవ్‌గాంధీ నగర్ 2012, 2024 మధ్య 12 ఏండ్ల కాలంలో రెండింతలు ఇండ్లు వెలిశాయి. ఈ ఇండ్లు పూర్తిగా మైసమ్మ చెరువును ఆక్రమించి నిర్మించినట్టు ఇరిగేషన్ అధికారులు హైడ్రా కమిషనర్‌కు నివేదికను అందించారు.