- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదృశ్యమైన విద్యార్థినులు సూర్యలంక బీచ్‌లో ప్రత్యక్షం
దిశ, కూకట్ పల్లి : ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన విషయం తెలిసిందే. వీరు చీరాలలోని సూర్యలంక బీచ్‌లో ప్రత్యక్షం అయ్యారు. రోజు వారి మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన వీరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గురువారం కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విద్యార్థినుల స్నేహితులతో వాకబు చేయగా సూర్యలంక బీచ్‌కు వెళ్లాలని రెండు మూడు రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నారని తెలిసింది.
దీంతో పోలీసులు సూర్యలంక పోలీసులను అప్రమత్తం చేశారు. కూకట్పల్లి నుంచి ఒక టీంను సూర్యలంకకు పంపించినట్టు ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ కొత్తపల్లి ముత్తులు మీడియాకు వివరించారు. విద్యార్థినులు ఇద్దరూ సూర్యలంకలో పోలీసులకు కనిపించారు. ఇద్దరు విద్యార్థినులను నగరానికి తీసుకు వచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.
అసలేం జరిగింది...
జగద్గిరిగుట్టకు చెందిన లక్ష్మీ దుర్గా( 13), బాలాజీనగర్‌కు చెందిన హారిక (13)లు ఇద్దరూ కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. కాగా ఇద్దరూ గత కొంత కాలంగా చీరాలలోని సూర్యలంక బీచ్‌కు వెళ్లాలని, అక్కడ రూం తీసుకుని రెండు రోజులు ఎంజాయి చేయాలని క్లాస్ రూంలో తమ స్నేహితులతో డిస్కస్ చేసుకుంటూ ఉండే వారు. అంతే కాకుండా లక్ష్మీ దుర్గా కుటుంబానిది సూర్యలంక సమీపంలోని గ్రామం కావడంతో ఎలాగైనా అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. రోజు వారి మాదిరిగానే బుధవారం ఇంటి నుంచి స్కూల్‌కు బయలు దేరిన లక్ష్మీ దుర్గా, హారికలు తమతో పాటు స్కూల్ బ్యాగ్‌లో సివిల్ డ్రెస్ తీసుకు వచ్చారు.
రోజు వారి మాదిరిగానే సాయంత్రం 4:26 నిమిషాలకు స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్కూల్ పరిసరాలలో సంచరిస్తూ డ్రెస్ మార్చుకోవడానికి అనువైన చోటును వెతికారు. కొద్ది దూరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న వాచ్‌మెన్‌తో వాష్‌రూంకు వెళ్లాలంటూ రెక్వస్ట్ చేశారు. దీంతో వాచ్మెన్ భార్య వారిని బాత్రూం వినియోగించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఇద్దరు బాత్రూంకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న సివిల్ డ్రెస్‌లను మార్చుకుని అక్కడి నుంచి వెళ్లి పోయారు.
లక్ష్మీదుర్గా తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్కూల్ నుంచి బయటికి వస్తున్నప్పటి నుంచి కొద్ది దూరం వరకు ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయిన సీసీ ఫూటేజీలో స్కూల్ నుంచి వచ్చి, డ్రెస్‌లు మార్చుకుని వెళ్లే వరకు వీడియోలు బయటికి వచ్చాయి. క్లాస్ రూంలో స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు సూర్యలంక బీచ్ వద్దకు వెళ్లి ఉండవచ్చునని కూకట్పల్లి పోలీసులు సూర్యలంక పోలీసులను సంప్రదించి అక్కడి హోటల్లు, బీచ్ పరిసరాలలో గాలించారు. లక్ష్మీ దుర్గా, హారికలు ఇద్దరు పోలీసులకు చిక్కారు.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో...
లక్ష్మీ దుర్గా, హారికలు ఇన్స్ట్రా గ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉండే వారు. సూర్యలంకకు చెందిన ఓ అబ్బాయితో పరిచయం అయింది. వీరిద్దరూ అక్కడికి వెళ్లిన తరువాత ఓ అబ్బాయిని కలిసి సూర్యలంక బీచ్‌లో దిగిన ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడం, చాటింగ్ చేయడంతో వారిద్దరు సూర్యలంక బీచ్ వద్ద ఉన్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నట్టు తెలుస్తుంది.