- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంట కార్పొరేషన్‌లో అక్రమార్కులకు గుబులు..గతంలో ఫిర్యాదులతో హైడ్రా టీమ్ పర్యటన
దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం జంట కార్పొరేషన్ లలో పలు అక్రమాలపై ఫిర్యాదులు రావడం తో హైడ్రా టీమ్ ఎంటర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా జంట కార్పొరేషన్ లలో అలజడి రేగింది. గతంలో బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చింతలచెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై కొత్త కిషోర్ గౌడ్, కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్ లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. అలానే పీర్జాదిగూడ మున్సిపాలిటీ లో సర్వే నంబర్ 1 లో గ్రేవ్ యార్డ్ కబ్జాకు గురి అయ్యిందని ఛార్లెస్, మదార్ లు ఫిర్యాదు చేయడంతో సోమవారం హైడ్రా టీమ్ లోకల్ సంబంధిత అధికారులతో పర్యటించి వివరాలు సేకరించారు. పర్యటించిన వారిలో హైడ్రా టీమ్ అడిషనల్ కలెక్టర్ సుధా, తహసీల్దార్ హేమ, ఏ ఈ విజయ్ కుమార్ లతో పాటు మేడిపల్లి తహసీల్దార్ హసీనా, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ రఘు, ఇరిగేషన్ ఏ ఈ పరమేష్, ఆర్ ఐ లు రాకేష్, సత్యనారాయణ లు పాల్గొన్నారు.