కిందిస్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా : లచ్చిరెడ్డి

by Aamani |   ( Updated:2024-09-14 13:24:59.0  )
కిందిస్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి  కృషి చేస్తా : లచ్చిరెడ్డి
X

దిశ,శామీర్ పేట: కింది స్థాయి ఉద్యోగులందరి కళలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధంగా ఉందని ఆ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. శనివారం తూముకుంట మున్సిపాలిటీలోని మొగుళ్ళ వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో రెవెన్యూ శాఖ ఉద్యోగులు, టెక్నికల్ మేనేజర్లు, టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన లచ్చిరెడ్డి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిందిస్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు .నిరంతరం ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు టైపిస్టుల కృషి అమోఘం అని చెప్పారు.

వీరందరికీ సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన జేఏసీకి ఉందని, రాబోయే ఫోర్త్ సిటీలో రెవెన్యూ ఉద్యోగులకు కంప్యూటర్ ఆపరేటర్లకు టైపిస్టులకు కచ్చితంగా హెల్త్ ఎడ్యుకేషన్, ఇండ్లు ఇప్పించడానికి జెఎసి చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని అన్నారు. మీరందరూ వ్యక్తులు కాదు అని శక్తులు అని కొనియాడారు. ప్రభుత్వ సంస్థలకు ఇండస్ట్రియలకు ఇచ్చే రాయితీల ప్రకారమే ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ భూములు ఇప్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ఈ ఎం ఐ లు కట్టి ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. త్వరలోనే వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి అందర్నీ ఆదుకోవాలని జేఏసీ భావిస్తుందని ఏ ఉద్యోగి కష్టం వచ్చినా మా జేఏసీ అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తూ వారికి దగ్గర కావాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని క్షణాల్లో అధికారులకు చేరవేసే ప్రభుత్వ పనుల్లో భాగస్వామ్యం వహిస్తున్నారని చెప్పారు .ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు టైపిస్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed