Land Grabbings: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదుల వెల్లువ

by srinivas |   ( Updated:2024-10-27 14:12:42.0  )
Land Grabbings: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదుల వెల్లువ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)కు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ జనాల నుంచి వినతులు స్వీకరిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ కబ్జాల(Land Grabbing)కు సంబంధించే ఎక్కువగా కంప్లైట్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కబ్జాకోరులు తమ భూములను ఆక్రమించారని, తమకు న్యాయం చేయాలంటూ పవన్ కల్యాణ్‌కు బాధితులు అర్జీ పెడుతున్నారు. దీంతో వెంటనే స్పందిస్తున్న ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా భీమవరం(Bhimavaram)లో జరిగిన భూ కుంభకోణంపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందింది. జగనన్న కాలనీ(Jagananna Colony) పేరుతో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సెంటు స్థలం, ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Former MLA Grandhi Srinivas) అక్రమాలు పాల్పడ్డారని పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో ఆయన అనుచరులు రుణాలు తీసుకున్నారని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పవన్ కల్యాణ్.. వెంటనే పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) కలెక్టర్‌తో మాట్లాడారు. విచారణ చేపట్టాలని సూచించారు. భీమవరంలో జరిగిన లావాదేవీలు, అక్రమాలపై తనకు నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed