- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
protest : సారూ...మా కొడుకు మృతదేహాన్ని మాకు అప్పగించండి..మాకు ఏ పైసలు వద్దు..
దిశ, నకిరేకల్: నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. సారూ...మా కొడుకు మృతదేహాన్ని మాకు అప్పగించండి..మాకు ఏ పైసలు వద్దు.. కేవలం మమ్మల్ని చూడనిస్తే చాలు..మా కొడుకు చనిపోయి ఒక రోజు అవుతుంది..అయినా కనీసం చూడనీయడం లేదు... పోలీసులు మమ్మల్ని ఎప్పటికీ అప్పుడు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ బాధితులు నిరసన చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలంలోని మానాయికుంట బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన యువకుడిని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 24 గంటలైనా మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోవడంతో పాటుగా.. కుటుంబ సభ్యులను సైతం చూసేందుకు నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు.పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కుటుంబ సభ్యులను మృతదేహాన్ని చూడకుండా అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. ఉదయం నుంచి ఏదో సాకులు చెబుతూ పై అధికారులు వస్తారని పోస్టుమార్టం చేస్తారని చెప్పారు. అయినా రాత్రి 8:00 అవుతున్న పోస్టుమార్టం చేయడం లేదు. కూలీ పనుల కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా చనిపోయిన బాధితునికి న్యాయం చేస్తామని పై మాటగా చెబుతూనే దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కుటుంబ సభ్యులను సైతం మృతదేహాన్ని చూడనీయడం లేదు. అసలు దీని వెనక కారణం ఏంటని విషయం తెలియడం రావడంలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో ఉన్నప్పటికీ మేము ఎటువంటి కోరికలు కోరుకోలేదని కేవలం పోస్టుమార్టం చేసి ఇవ్వాలని మాత్రమే కోరామని అయినప్పటికీ మమ్మల్ని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు వెళ్ళబుచుతున్నారు. ఏదేమైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.