‘మా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం’.. జన్వాడ ఘటనపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్

by Gantepaka Srikanth |
‘మా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం’.. జన్వాడ ఘటనపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse) ఘటనపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు అది ఫామ్‌హౌజ్(Farmhouse) కాదు. నా బావమరిది ఇల్లు. గృహప్రవేశం చేసిన రోజున అందరినీ పిలిచి దావత్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ ఫంక్షన్‌ను ఇవాళ నిర్వహించారు.

కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి దావత్ చేసుకోవడం కూడా తప్పేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దానికి కూడా అధికారులు, పోలీసుల అనుమతి తీసుకోవాలా? అని అడిగారు. ప్రజల్లో తమను నెగిటివ్ చేసే ప్రయత్నంలో భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారని తెలిపారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు. అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి అని సూచించారు. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అన్నారు. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాశారు.

ఇది చాలా దుర్మార్గమైన విషయం అని ఆవేదన చెందారు. అంతేకాదు.. తాను అక్కడే ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. పోలీసులు రావడానికి 20 నిమిషాల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు అని కేటీఆర్(KTR) అసహనం వ్యక్తం చేశారు. తాను ఇంట్లో ఉన్నారని చెప్పారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గాలికొదిలారు. అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం చేస్తూనే ఉంటాం. అనవసరంగా తమ జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం. చావును కూడా లెక్కచేయం అని కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed